HI EVERY ONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
తెలంగాణలోని గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీ కి సబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR ) ప్రక్రియ ప్రారంభమైంది.
అప్లై చేయుటకు కావలిసిన సర్టిఫికేట్ లు :-
AADHAR CARD |
CASTE CERTIFICATE |
SSC MEMO |
INTER MEMO |
DEGREE MEMO |
PG MEMO |
OTHER QUALIFICATION MEMOES ( IF ANY ) |
ఈ OTR ప్రక్రియని ఇక్కడ తెలుసుకుందాం!
ముందుగా గూగుల్( GOOGLE ) ని ఓపెన్ చేయండి.
సెర్చ్ బాక్స్ లో TREIRB అని టైప్ చేయండి.
కింద చూపిన విధంగా స్క్రీన్ వస్తుంది. అందులో మొదటి ఆప్షన్ పై క్లిక్ చేయండి.
మొదటి ఆప్షన్ పై క్లిక్ చేయగా స్క్రీన్ ఇలా వస్తుంది. అందులో ఆకుపచ్చ రంగులో ఉన్న One Time Registration / Apply Online పై క్లిక్ చేయండి.
తర్వాత screen కింది విధంగా వస్తుంది.
ఇక్కడ మొత్తం అప్లై చేయడం 5 దశలలో ఉంటుంది.
1 Registration
2 Sign Up
3 payment of Exam Fee
4 Fill Application Form & Submit
5 Print Application Form
పై వాటిలో మనం ఇక్కడ Registration గురించి మాత్రమే ఇక్కడ తెలుసుకుందాం.
ఇది చేస్తే OTR పూర్తి అవుతుంది.
దీని కోసం కింది image లో ఉన్న New Registration ( OTR ) పై క్లిక్ చేయండి.
తర్వాతి స్క్రీన్ ఇలా వస్తుంది. ఇందులో మన ఆధార్ నెంబర్ ఇచ్చి GO పై క్లిక్ చేయాలి.
Registration Flow కింది విధంగా ఉంటుంది.
ఇందులో ౩ సెక్షన్ ఉంటాయి.
- Basic Details
- Educational Qualifications
- Photo, Signature & Declaration
1వ సెక్షన్-Basic Details
Basic Details లో ఉండే అంశాలను కింది స్క్రీన్ లో చూడండి.
Basic Details లో 4 అంశాలు ఉంటాయి.
Basic Details
Other Details
Address Details
Schooling Details
Basic Details లో ముఖ్య సూచనలు:-
మొదటగా ఉన్న Status లో Are you local to Telangana State? దగ్గర yes అని టైప్ చేస్తేనే చివరలో ఉన్న Schooling Details వస్తాయి. అక్కడ ఏమి ఇవ్వకుంటే Address Details వరకు మాత్రమే చూపిస్తాయి. ( గమనించగలరు )
ఒక్కోసారి సైట్ లో ఇది వేర్వేరు విధంగా కూడా చూపిస్తుంది. అనగా Schooling Details అనేవి update చేసే కొద్ది చూపిస్తున్నాయి.
Caste సమాచారం ఇచ్చేటప్పుడు మీ Community, Sub Caste ఇచ్చాక Do you have Caste Certificate? దగ్గర yes అని ఇవ్వాలి. ఒకవేళ no అని ఇస్తే మీరు రిజర్వేషన్ పరిది లోకి రారు అన్నమాట.
SC, ST, BC వాళ్ళు yes అని ఇచ్చాక మీ కులం సర్టిఫికేట్ నెంబర్ మరియు అది ఇచ్చిన తేదీ సరిగా వేయాలి. లేనిచో ప్రాసెస్ ముందుకు పోదు.
ఇక్కడ ఇంకో విషయం….
క్రిమి లేయర్- నాన్ క్రిమి లేయర్ దగ్గర నాన్ క్రిమి లేయర్ అని ఇవ్వాలి.
ఒకవేళ మీరు సంపన్న వర్గాలకు చెందిన వారు అయితే మాత్రమే క్రిమి లేయర్ అని ఇవ్వాలి.
ఇక మిగతా అంశాలన్నీ సులభంగా ఇవ్వవచ్చు.
Other Details లో ఉండే అంశాలు:-
ఇక్కడ మీకు వర్తించే అంశాలకు yes అని ఇవ్వండి, లేదా వర్తినంచక పోతే no అని ఇవ్వాలి.
Address Details లో ఉండే అంశాలు:-
ఇక్కడ ఒకేలా ఉన్న అంశాలను 2 రకాలుగా అనగా Adress for Correspondence, Permanent address లుగా ఉంటాయి.
వీలైతే ఈ రెండు అంశాలు Permanent address కి సంబంధించినవై ఇవ్వండి.
మధ్యలో ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేయాలి.
Schooling Details లో ఉండే అంశాలు:-
ఇక్కడ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన సమాచారం ఇవ్వాలి.
మీ జిల్లా పేరు ఇవ్వగానే జోన్, మల్టీ జోన్ వివరాలు ఆటోమేటిక్ గా వస్తాయి.
2వ సెక్షన్-Educational Qualifications
Educational Qualifications లో ఉండే అంశాలు:-
10వ తరగతి నుండి P.hd వరకు మీకు వచ్చిన మార్కులు, చదివిన సమాచారం ఉంటుంది.
మీకు వర్తించే చదువుకు మాత్రమే చెక్ బాక్స్ లో క్లిక్ చేస్తూ ఆ సమాచారం ఇవ్వండి.
అవసరం లేని Qualifications ను వదిలి వేయాలి.
౩వ సెక్షన్- Photo, Signature & Declaration
Photo, Signature & Declaration లో ఉండే అంశాలు:-
ఇక్కడ ఫోటో మరియు సంతకం వేర్వేరుగా ఇవ్వాలి.
ఫోటో సైజు 2.5 cm × 2.5 cm – jpg ఫార్మాట్ లో, 50 kb లోపల ఉండాలి.
సంతకం సైజు 2.5 cm × 1.5 cm – jpg ఫార్మాట్ లో, ౩0 kb లోపల ఉండాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేశాక కింద ఉన్న Declaration దగ్గర గల చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి.
తర్వాత చివరలో ఉన్న Preview పై క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం నింపిన అన్ని అంశాలు వస్తాయి.
వీటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాతే Submit ను క్లిక్ చేయాలి.
submit చేశాక screen ఇలా వస్తుంది. మళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న Submit పై క్లిక్ చేస్తే final Submit అవుతుంది.
final Submit అయ్యాక screen ఇలా వస్తుంది.
ఇక్కడ మనకు Reference ID, OTR వస్తాయి.
ఇక్కడ ఉన్న Receipt పై క్లిక్ చేస్తే One Time Regestration OTR Receipt వస్తుంది.
ఇందులో చివరలో ఉన్న Print ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ప్రింట్ వస్తుంది.
Note:-
ప్రతీ సెక్షన్ పూర్తి కాగానే Partial Save పై క్లిక్ చేసి, ఇంకో సెక్షన్ కి వెళ్ళాలి. అలా అయితే మీరు నింపిన అంశాలు save అవుతాయి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
flash news
ఇక్కడ క్లిక్ చేయండి.