HI EVERY ONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
గురుకులాల 5వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల
అప్లై చేయు తేదీని మరో 4 రోజులు అనగా 20-03-2023 వరకు పొడిగించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2023 – 24 విద్యా సంవత్సరానికి…
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
09-02-2023
అప్లికేషన్ చివరి తేదీ :
20-03-2023
ప్రవేశ పరీక్ష తేదీ :
23-04-2023
సమయం :
ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
అప్లై చేసుకునే విధానం:-
మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ వెబ్సైట్
www.tgtwgurukulam.telangana.gov.
www.mjptbcwreis.telangana.gov.in
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ : 09-02-2023 నుండి 06-03-2023 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును
ఎంపిక విధానం:-
విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది
అర్హతలు:-
2022- 2023 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
OC మరియు BC పిల్లలు 01-09-2012 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).
SC మరియు ST పిల్లలు, SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు 01-09-2010 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).
సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.
అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-
1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH
4. మొబైల్ నెంబర్
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. కులం (వివరాలు)
7. ఆదాయం ( వివరాలు)
8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో
10. విద్యార్థి సంతకం
11. తండ్రి పేరు
12. తల్లి పేరు
13. గ్రామము పేరు
14.మండలం పేరు
15. జిల్లా పేరు
16. పాత జిల్లా పేరు
17. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు
18. పోస్ట్ బాక్స్ నెంబర్
ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.
పరీక్షా విధానం -పాత ప్రశ్న పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE
ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
అప్లై చేయుటకు | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.