HI EVERYONE. WELCOME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
*NEET (UG)-2023 : నీట్-2023 పరీక్ష మే 7న జరగనుంది.
NEET- NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST
ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1వ వారంలో ప్రారంభమయ్యింది.
అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తరువాత ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ neet.nta.nic.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.*
వైద్య కలను నెరవేర్చుకోవాలంటే విద్యార్థులు నీట్(NEET)లో అర్హత సాధించాలి.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అత్యంత కఠినమైన ఎంట్రెన్స్ టెస్టుల్లో ఒకటిగా నీట్‌ను పేర్కొంటారు.
నీట్-2023 పరీక్ష మే 7న జరగనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి (మార్చి 1) ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తరువాత ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ neet.nta.nic.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నీట్ అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
అర్హత :
ఇంటర్ పాసైన అభ్యర్థులతో పాటు ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నీట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే సైన్స్ స్ట్రీమ్‌లో బయాలజీ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి.
అంతేకాకుండా జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఇంటర్‌లో తప్పనిసరిగా కనీసం 50 శాతం స్కోర్, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం స్కోర్ చేసి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 17 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన నీట్‌కు లేదు.
అప్లై చేయు విధానం :
ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను విజిట్ చేయాలి.
ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి నీట్ యూజీ-2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్‌ను ఫిల్‌అప్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
ఆ తరువాత పేమెంట్ చేసి, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం నీట్ యూజీ -2023 కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము :
నీట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1,700 ఫీజుగా చెల్లించాలి. ఈడబ్ల్యుఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.1,600… ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీ, థర్డ్ జండర్ అభ్యర్థులు రూ .1000 ఫీజుగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
వివిధ కోర్సుల్లో అడ్మిషన్ సీట్ల వివరాలు :
ప్రతి ఏటా 15 లక్షల నుంచి 18 లక్షల మంది అభ్యర్థులు మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరవుతారు.
నీట్ యూజీ -2023 ద్వారా ఎంబీబీఎస్‌లో 91,827 సీట్లకు అడ్మిషన్స్ కల్పించనున్నారు.
బీడీఎస్ – 52,720, ఆయూష్-487, బీఎస్‌సీ నర్సింగ్-487, బీవీఎస్‌సీ-603, ఎయిమ్స్ ఎంబీబీఎస్-1899, జిప్‌మర్ ఎంబీబీఎస్-249 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు.
పరీక్షా విధానం :
నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు.
నీట్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి.
వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది.
ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.
బయాలజీ నుంచి మొత్తంగా 100 ప్రశ్నలు ఉంటాయి.
కాగా, నీట్-2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.*
*BiPC విద్యార్థులు…. నీట్ అర్హత ద్వారా…… MBBS,, BDS, BVSC, BAMS, BHMS, BUMS, BSMS, BNYS, B SC FOOD TECHNOLOGY, BPT B SC FORENSIC SCIENCE, B SC RADIOLOGY, B SC CORDIK, B SC ANESTHESIA, B SC, B SC NURSING, B.SC AGRICULTURE, HORTICULTURE, FISHERIES & COMMUNITY SCIENCE… కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:-
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 06-03-2023 |
అప్లికేషన్ చివరి తేది | 06-04-2023 |
ఎడిట్ ఆప్షన్ | WILL INFORM LATER |
పరీక్ష తేదీ | 07-05-2023 SUNDAY |
పరీక్షా సమయం | 2:00 PM- 5:20 PM 200 MINUTES 3 HOURS 20 MINUTES |
NEET UG PROCEEDING:-
INFORMATION BULLETIN:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.