HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*_*-*-*
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే యొక్క ఏన్యుమరేటర్స్ సూచనలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈ సర్వే ను మనం 10 రోజులలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒక్కో ఏన్యుమరేటర్ కు 175 కుటుంబాలను కేటాయిస్తారు.
ఒకవేళ మన హబిటేషన్ పరిధిలో 200 కి పైగా కుటుంబాలు ఉంటే అదనపు ఏన్యుమరేటర్ ని నియమిస్తారు.
ఈ సర్వే ముఖ్యంగా 2 దశలలో ఉంటుంది.
1- House Listing ( స్టిక్కరింగ్ వేయడం )
2-Actual Survey ( ఇంటింటి సర్వే )
ఒక్కో కుటుంబం యొక్క డేటా ని మనం 8 పేజీలలో ఉన్న దరఖాస్తులో నింపాలి.
దీనికి మనకు సుమారుగా 40 mins సమయం పడుతుంది.
కావలిసిన డాక్యుమెంట్స్ :-
కింద తెలిపిన డాక్యుమెంట్స్ కచ్చితంగా కావాలని కోరకూడదు. యజమాని వీటిని చూపిస్తేనే మనం పరిగణనలోకి తీసుకోవాలి.
1- ఆదార్ కార్డ్
2- ధరణి పాస్ బుక్
3- రేషన్ కార్డ్..ఇతరములు
ప్రతి 10 /15 మంది ఎన్యుమరేటర్ల కు ఒక సూపర్వైజర్ ఉంటారు.
సూపర్వైజర్ – అతనికి కేటాయించిన ఎన్యుమరేటర్లు నమోదు చేసిన దాటాలో 10 % డేటా ని వెరిఫై చేస్తారు.
సర్వే లో మనం ఏ ఒక్క ఇంటిని, కుటుంబాన్ని వదిలివేయకూడదు.
సర్వే లో నమోదు చేసిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు గోప్యత పాటించాలి.
సర్వే ఫారంలో * గుర్తు ఉన్న ప్రదేశంలో కోడ్ లను మాత్రమే మనం రాయాలి.దీనికై కోడ్ బుక్ లేట్ ఉంటుంది.
ఎక్కడ ఎలాంటి తప్పు ఎంట్రీ లు లేకుండా సర్వే కొనసాగించాలి.
ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎన్ని మొబైల్స్ ఉంటె అన్ని నెంబర్లను మనం రాయాలి.
మనం రాసే కోడ్ ల దగ్గర – కోడ్ లో ఉన్నదీ కాక వేరే ఉంటె దానిని ఇతరములు అనే కోడ్ తో రాసుకోవాలి.
ఏదైనా తెలియక పోతే, ఆ ఒక్క ఎంట్రీ కోసం మొత్తం కుటుంబం ఎంట్రీ ని ఆపకూడదు.
కుటుంబం ఎలా పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న పొయ్యి నే ప్రామాణికంగా తీసుకోవాలి.
సర్వే ఎంట్రీ ఫారంలో Part-1 , part-2 అనే 2 సెక్షన్లు ఉంటాయి.
Part-1 part-2
1-48(d) 49(a)-56(d)
Part-1 లో ఉండే అంశాలన్నీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి మనం నమోదు చేయాలి.
Part-1 లో ఉండే అంశాలు
- సాధారణ వివరాలు
2. విద్యా వివరాలు
౩. ఉద్యోగ/ఉపాధి వివరాలు
4.భూమి వివరాలు
5.రిజర్వేషన్ ప్రయోజనాలు
6. రాజకీయ నేపథ్యం
7. వలస వివరాలు
part-2 లో ఉండే అంశములు అన్నియూ మొత్తం కుటుంబం ని పరిగణన లోకి తీసుకొని నింపుతాము.
Socio econamic సర్వే కు వెళ్తున్న ( గణకులు )ఎన్యుమరేటర్లకు సూచనలు
1. ఈ సర్వేలో అత్యంత ప్రధానమైనది కుటుంబాలను గుర్తించడం.
2. మీరు హౌస్ లిస్టింగ్ కు వెళ్ళినప్పుడే ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అనేది నిర్ణయించండి. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచార ఆధారంగా ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా కుటుంబాల సంఖ్యను గుర్తించండి.
3. ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబాలు *ఇలాంటి సర్వే సమయంలో విడివిడిగా రాయించుకోవడానికి మొగ్గు చూపుతారు. కావున వారిచ్చిన సమాచార ఆధారంగా కుటుంబాలను నిర్ణయించండి.
4. సర్వే మొదలుపెట్టిన తర్వాత కొత్త కుటుంబం తెరపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.
5. హౌస్ లిస్టింగ్ సమయంలో ఎన్ని కుటుంబాల వివరాలు రాయాలో తెలుసుకుని ఆ కుటుంబ పెద్దలు సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడమని చెప్పండి. వారి యొక్క ఆధార్ కార్డుల సమాచారం, ధరణి, రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలని చెప్పండి.
5. ప్రభుత్వ పథకాలు సజావుగా అందరికీ చేరాలంటే ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని వారికి తెలియజేయండి.
6. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకోండి. సర్వే మీకు చాలా సులభం అవుతుంది.
7. మీరు వెళ్లిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే పక్కన ఉన్నవారికి తెలియజేసి సర్వే సమాచారం చెప్పమనండి.
మీ ఎన్యుమరేషన్ బ్లాక్ లో అన్ని కుటుంబాలను గుర్తించిన తర్వాత సర్వే ప్రారంభించండి.( Nov: 6 – 18 )
8. సర్వే రోజు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ కుటుంబంలో సరియైన సమాచారాన్ని వివరంగా ఎవరు చెబుతారో వారిని పిలవండి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను తీసుకొని ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని పూర్తిగా నమోదు చేసుకోండి.
పేరు, వయసు, ఆధార్ సంఖ్య… మొబైల్ నెంబర్
9. మొదటిరోజు సర్వేను నిదానంగా చేస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా యజమానిని అడిగి వివరాలు రాసుకోండి.
9. మొదటి రోజు *రెండు లేదా మూడు సర్వే పారాలను పెన్సిల్ తో రాసుకోండి. దీనివలన ఏ అంశాలలో తప్పులు జరుగుతున్నాయో మీకు సులభంగా తెలుస్తుంది.
10. ఒక కుటుంబంలో పదిమంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్నట్లయితే రెండవ ఫారాన్ని నింపండి.. ఉమ్మడి కుటుంబంలో ఫారం నింపేటప్పుడు యజమాని, అతని భార్య పెద్దకొడుకు, అతని భార్య పిల్లలు/ చిన్న కొడుకు అతని భార్య, పిల్లలు వరుస క్రమంలో రాసుకోండి. ఇలా చేస్తే యజమానితో బంధుత్వం మీరు సులభంగా రాయగలుగుతారు. సమయం ఆదా అవుతుంది.
11. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ప్రతీ కాలం లోని వివరాలు అడిగి పూరించాలి.
12. 20వ, కాలంలో వివరాలను నింపినట్లైతే 21,22,23,24 లో* సమాచారం నమోదు చేయాలి. 20వ కాలం ఖాళీగా ఉన్నట్లయితే మిగిలిన పూరించవలసిన అవసరం లేదు.
13. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పినట్లయితే ఆదాయపన్ను చెల్లిస్తారు గమనించగలరు. ప్రయివేటు పనులు, వ్యాపారస్తులు కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా అడగండి.
14. 43 వ, కాలం a, b, c చాలా ముఖ్యమైన అంశాలు. పెన్షన్, రైతు బంధు, కల్యాణలక్ష్మి, ప్రభుత్వ ఇల్లు, స్కాలర్ షిప్స్, సిఎం సహాయ నిధి, రుణమాఫీ, రైతు భీమా, ఆరోగ్యశ్రీ, గొర్రెల పంపిణీ, చేనేత, దళిత బంధు
15. 46( a) నుండి 46(f) రాజకీయ పరమైనవి అంశాలు, కొంతమందికి మాత్రమే ఉంటాయి గమనించగలరు.
16. 48వ, కాలం వలసకు సంబంధించింది ( ఇతర రాష్ట్రం, ఇతర దేశం )
మీ కుటుంబంలో మీ పిల్లలు ఉన్నత చదువు, ఉద్యోగం, పెళ్లి , వ్యాపారం, కోసం వలస వెళితే వారి వివరాలు, వారు వెళ్లిన దేశం, లేదా రాష్ట్రం వివరాలు. 48(a), 48(b), 48(c), 48(d) రాయాలి.
వలస వెళ్లనట్లయితే ఈ కాలమ్స్ నింపవలసిన అవసరం ఉండదు.
చివరలో యజమానితో సంతకం పెట్టించండి.
ధన్యవాదాలు……
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు
SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు
దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ
DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు
సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా
DOWNLOAD FLN WORK BOOKS CLASS 1 TO 5
సెప్టెంబర్ 2 న పాఠశాలలకు సెలవు
NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
NAS 6వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
NAS 9వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
ఆగస్ట్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా
TG DSC 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 1-2-3-4-5
DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 6-7-8-9
DEPARTMENTAL TESTS RESULTS MAY 2024 SESSION
TS SET 2024 పరీక్ష తేదీలు మార్పు
IIIT బాసరకు ఎంపిక అయిన విద్యార్థుల 4వ లిస్టు 4th list
NATIONAL ACHIEVEMENT SURVEY INFORMATION
DEE CET 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
LEFTOVER PSHM/SA DISTRICT WISE ORDERS
జాయినింగ్ – రీలీవింగ్ ఫారములు SGT TO SA/PSHM
అందుబాటులోకి వచ్చిన ప్రమోషన్స్ – వెబ్ ఆప్షన్లు – సూచనలు
JL CERTIFICATE VERIFICATION LIST
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.