TELANGANA STATE ELECTIONS 2023 VOTE FROM HOME

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

వయోవృద్దులు, దివ్యాంగులకు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకొనుటకు నిబంధనల మేరకు ఎన్నికల కమీషన్ అనుమతించడం జరిగింది.

ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఇలాంటి వారికి ఇంటి వద్ద నుండే ఓటు హక్కు కల్పించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది. 

ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే 80 ఏళ్లకు పై గల వయోవృద్దులు, 40 శాతం కన్నా మించి ఉన్న దివ్యాంగులు ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైన వారు ఫారం-12 డి లో తమ పూర్తి వివరాలను నమోదు చేసి నవంబర్ 7 వ తేదీలోగా ఆయా బూత్ స్థాయి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది, అలా ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికే ఇంటివద్ద నుండి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటును ఆయా సంబంధిత రిటర్నింగ్ అధికారులు కల్పిస్తారు. 

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటానని తెలిపిన వారికి ఫారం-12 డి ఇవ్వరని తెలిపారు. 

పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులు, వయోవృద్దుల కోసం వీల్ చైర్స్, వాకింగ్ స్టిక్స్ లతో పాటు అటెండర్ ను అందుబాటులో ఉంచారు.

 ఫారం-12 డి ద్వారా ఇంటి వద్ద నుండి ఓటు హక్కు వినియోగించుకునే వారి వద్దకు ముందురోజే పోలింగ్ అధికారులు, వీడియో గ్రాఫర్, పోలీసులతో వెళ్లడం జరుగుతుంది. ఆయా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు కంపార్టుమెంట్ ను ఏర్పాటు చేస్తారని, సదరు ఓటర్లు రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకుని బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ అంతా వీడియో కవరేజి చేయడం జరుగుతుందన్నారు. 

NOTE:-

ఒకవేళ మొదటి రోజు ఓటు హక్కు వినియోగించుకోని పక్షంలో మరొక సారి ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని, ఇలా రెండు సార్లు మాత్రమే వీలు కల్పించడం జరుగుతుంది. 

2 సార్లు అవకాశం వాడుకోని వారు పోలింగ్ తేదిన వచ్చి ఓటు వేయడం మాత్రం కుదరదు.

రాష్ట్రంలోని అర్హత గల వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ECI విజ్ఞప్తి చేశారు.

FOR DOWNLOAD FORM 12D:-

CLICK HERE- ఇక్కడ క్లిక్ చేయండి

FORM 12D ని ఇక్కడ చూడవచ్చు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

error: Content is protected !!