HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ఒక పోలింగ్ స్టేషన్ లో 1 పోలింగ్ ఏజెంట్ & 2 రీలీవింగ్ ఏజెంట్లు నియమించుకోవచ్చు.
అయితే ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ ను మాత్రమె పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలి.
అంటే ౩ గురు నియామకం అయినప్పటికీ ఒకరు మాత్రమే పోలింగ్ స్టేషన్ లో ఉండాలి.
అభ్యర్థి/ ఎన్నికల ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ నియామకాన్ని ఏ సమయం లోనైనా రద్దు చేయవచ్చు.( WITH FORMS ).
పోలింగ్ ఏజెంట్ రద్దు చేయబడితే/చనిపోతే మరొక పోలింగ్ ఏజెంట్ ని అభ్యర్థి/ ఎన్నికల ఏజెంట్ నియమించుకోవచ్చు.
అర్హతలు:-
పోలింగ్ ఏజెంట్ ఒకే పోలింగ్ బూత్ లేదా అదే నియోజక వర్గం పరిధిలోకి వచ్చే పొరుగున ఉన్న పోలింగ్ స్టేషన్ లోని ఓటర్ అయి ఉండాలి.
ఏదేని ID ( EPIC/AADHAR/ ANY..) కల్గి ఉండాలి.
సర్పంచ్/పంచాయితీ సభ్యులు,కౌన్సిలర్లు/ మున్సిపాలిటీ సభ్యులు, స్థానిక వ్యక్తులను పోలింగ్ ఏజెంట్లు గా నియమించుకోవచ్చు.
పోలింగ్ ఏజెంట్లను నియమించుకునే పద్ధతి:-
పోటీ చేస్తున్న అభ్యర్థి/ ఎన్నికల ఏజెంట్ ఇచ్చిన ఫారం-10 తీసుకోవాలి.
పోలింగ్ ఏజెంట్ నియామకం మీ పోలింగ్ స్టేషన్ కేనా అని చూసుకోవాలి.
అతని నియామకం నిరూపితం అయ్యాకనే పోలింగ్ ఏజెంట్ నుండి డిక్లరేషన్ తీసుకొని సంతకం చేయించాలి.
PO గారు పోలింగ్ ఏజెంట్లకు ఎంట్రీ పాస్ లు ( ANNEURE-12 ) ఇవ్వాలి.
ఎంట్రీ పాస్ ల రికార్డ్ ను ( ANNEURE-13 ) లో నమోదు చేయాలి.
ఎవరైనా పోలింగ్ ఏజెంట్ నియామక పత్రం ఫారం-10 లో మీకు ఏదైనా అనుమానం ఉంటె పత్రంలోని పోటీ చేసే అభ్యర్థి/ ఎన్నికల ఏజెంట్ సంతకాన్ని RO గారు మీకు ఇచ్చిన సంతకాలతో పోల్చి చూసుకోవాలి.
పోలింగ్ ఏజెంట్ల హాజరు జాగ్రత్తలు:-
ఉదయం 5:30 AM కు పోలింగ్ ఏజెంట్లు హాజరు కావాలి.
ప్రతీ పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఏజెంట్లు/ రీలివింగ్ ఏజెంట్ల కదలికల పత్రం ( ANNEURE-11 ) నిర్వహించాలి.
పోలింగ్ ఏజెంట్లు- ఓటర్ల జాబితాని బయటకు తీసుకెళ్ళకుండా జాగ్రత్త వహించాలి.
3.00 PM తరువాత ఏ agent ను కూడా బయటకు వెళ్ళడానికి అనుమతిచకూడదు
మొబెల్ ఫోన్స్ పోలింగ్ ఏజెంట్ల దగ్గర ఉండకూడదు.
ఎట్టి పరిస్థితి ల్లోనూ ఓటు వేసిన/ఓటు వేయని ఓటర్ల వరుస సంఖ్యను సూచిస్తూ వెలుపలికి స్లిప్పులను పంపడాన్ని అనుమతించరాదు.
పోలింగ్ ఏజెంట్లను మొదటి పోలింగ్ ఆఫీసర్ వెనకాల కూర్చోమనాలి, అలా సాధ్యం కాకపోతే పోలింగ్ అధికారులకు ఎదురుగా కుర్చీలు వేయించాలి.
పోలింగ్ ఏజెంట్లు కూర్చునే పద్ధతి:-
ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఏజెంట్ల సీట్ల ఏర్పాటు క్రింది ప్రాధాన్యతా క్రమంలోనే జరగాలి.
గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులు
గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల అభ్యర్థులు
గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీల అభ్యర్థులు
గుర్తింపు పొందని, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థులు
TS ELECTIONS 2023 UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.