HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
మాక్ పోల్ చేయు విధానం:-
EVM లను కనెక్ట్ చేయాలి.
పోలింగ్ ఏజెంట్లు, PO కంపార్ట్ మెంట్ వద్ద ఉండాలి.
NOTE:- PO వద్ద మాన్యువల్ రికార్డ్ షీట్, మాక్ పోల్ సర్టిఫికేట్ ఉండాలి.
CU ని టేబుల్ పై – 3వ పోలింగ్ అధికారి వద్ద ఉంచాలి.
VVPAT నాబ్ ని నిలువుగా తింపిన తర్వాత CU POWER ON చేయాలి.
CU POWER ON చేసిన తర్వాత VVPAT డ్రాప్ బాక్స్ లో 7 స్లిప్స్ పడుతాయి.
ముందుగా CU లో CLEAR బటన్ ప్రెస్ చేసి CU లో అందరు అభ్యర్థులకు 0 ఓట్లు ఉన్నాయని ఏజెంట్లకు చూపించాలి.
VVPAT డ్రాప్ బాక్స్ లో ఉన్న ఈ 7 స్లిప్స్ బయటకి తీసి వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన ఉంచాలి.
VVPAT డ్రాప్ బాక్స్ ఖాళీ ఉందని ఏజంట్లకు చూపించాలి.
పోలింగ్ ఏజంట్ల చే BU లో ఉన్న అన్ని బటన్ లు ( NOTA తో సహా ) అందరి అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చేలా మొత్తం 50 ఓట్లు వేయించాలి.
ఎవరెవరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది PO గారు ఒక కాగితం పై మాన్యువల్ గా కూడా రికార్డ్ చేయాలి.
మొత్తం 50 ఓట్లు పోల్ అయ్యాక CU లోని CLOSE బటన్ ప్రెస్ చేయాలి.
నోట్;- CU-CLOSE బటన్ ప్రెస్ చేయకుంటే RESULT బటన్ పనిచేయదు.
తర్వాత CU లోని RESULT బటన్ ప్రెస్ చేయాలి.
CU లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో PO గారు రికార్డ్ చేసుకోవాలి.
VVPAT డ్రాప్ బాక్స్ నుండి మాక్ పోల్ స్లిప్స్ బయటకు తీసి ఎవరెవరికి ఎన్ని స్లిప్స్ వచ్చాయో విడివిడిగా రబ్బర్ బ్యాండ్ తో ఉంచాలి.
CU-RESULTS కి, VVPAT పేపర్ స్లిప్స్ కి లెక్క కలిసిందని ఏజంట్లకు చూపించాలి.
ఏజెంట్లు ఓకే అన్నాక CU లో CLEAR బటన్ ప్రెస్ చేసి మాక్ పోల్ RESULT-౦ అయిందని చూపించాలి.
మాక్ పోల్ అయ్యాక తప్పకుండా CU- CLEAR బటన్ నొక్కాలి.
VVPAT నుండి బయటకు తీసిన 50 స్లిప్స్ కి వెనుకాల MOCK POLL SLIP ఉన్న రబ్బర్ స్టాంప్ వేయాలి.
వీలైతే అభ్యర్థుల వారిగా ఆ స్లిప్స్ ఉండాలి.
ఈ 7+50 స్లిప్స్ ని బ్లాక్ కలర్ ఎన్వలప్ కవర్ లో ఉంచి సీల్ వేయాలి.
ఈ ఎన్వలప్ పై PO గారు, ఏజెంట్లు విధిగా సంతకాలు చేయాలి.
ఎన్వలప్ పై VVPAT PAPER SLIPS OF MOCK POLL & పోలింగ్ స్టేషన్ పేరు, నెంబర్,అసెంబ్లీ నియోజకవర్గం పేరు, నెంబర్, తేదీ రాయాలి.
పింక్ పేపర్ సీల్ పై PO గారు, ఏజెంట్లు సంతకాలు చేసి, దానిని బ్లాక్ ఎన్వలప్ కి సీల్ వేయాలి.
PO గారు పై పక్రియ జరుగుతున్నంత సేపు ప్రక్రియ అంశాలను మాక్ పోల్ సర్టిఫికేట్ లో నమోదు చేయాలి.
తర్వాత CU POWER- OFF చేసి EVMలను సీల్ చేయాలి.
NOTE:- CRC ( CLOSE-RESULT-CLEAR ) విధానం మాక్ పోల్ కి మాత్రమే చేయాలి.
మాక్ పోల్ వీడియో
HoP 2024 UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.