ISRO-YUVIKA PROGRAMME FOR 9TH CLASS STUDENTS

HI EVERYONE. WELCOME TO MS BADI.

YUVIKA అనగా

YU- యువ (YUVA)

VI- విజ్ఞాని (VIgyani)

KA- కార్యక్రమం ( KAryakram)

YUVIKA ఉద్దేశ్యం:-

ISRO-ఇస్రో ( ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ) వారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ అప్లికేషను ల గురించి అవగాహన కల్పిస్తుంది.

ఎవరు అర్హులు?

యావత్ భారతదేశంలో నుండి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

ప్రతీ రాష్ట్రం నుండి సమాన ప్రాధాన్యత ఇవ్వబడును.

ఎంపిక విధానం:-

కింద ఇవ్వబడిన అంశాలను ఆధారంగా చేసుకొని విద్యార్థులను ఎంపిక చేస్తారు.

8వ తరగతిలో పొందిన మార్కులు.

గత ౩ సంవత్సరాలలో పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ / ఏదైనా సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం.

గత ౩ సంవత్సరాలలో పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ / ఏదైనా ఒలింయాడ్/సైన్స్ కాంపిటీషన్ లో పాల్గొని మొదటి ౩ స్థానాలలో ఉన్నవారు.

గత ౩ సంవత్సరాలలో పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ / ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్(రిజిస్టర్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) లో పాల్గొని మొదటి ౩ స్థానాలలో ఉన్నవారు.

గత ౩ సంవత్సరాలలో స్కౌట్/NCC/NSSలో సభ్యులుగా ఉండటం.

ఆన్లైన్ క్విజ్ లలో పాల్గొనడం.

 గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడును.

శిక్షణా కేంద్రాలు:-

ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కాబడిన విద్యార్థులకు 5 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి

  1. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం.

2. U.R. రావు శాటిలైట్ సెంటర్, బెంగళూర్.

3. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్.

4. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్.

5. నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్

శిక్షణా కాలం:-

16-05-2022 నుండి 28-05-2022 వరకు ఉంటుంది.

కల్పించే వసతులు:-

ఈ శిక్షణా పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది.

ప్రయాణం, బస, బోర్డింగ్ తో సహా అన్ని ఖర్చులను ఇస్రో వారు ఇస్తారు.

ఒక పేరెంట్/ గైడ్ టీచర్ కు కూడా ప్రయాణ ఖర్చు ఇస్తుంది.

కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విద్యార్థులను శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు తీసుకొని వెళతారు.

దరఖాస్తు ప్రారంభ తేది:-

10-03-2022

దరఖాస్తు చివరి తేది:-

10-04-2022

ఎంపిక జాబితా విడుదల తేది:-

20-04-2022

దరఖాస్తు చేసుకునే విధానం:-

దరఖాస్తు విధానం 4 స్టేజి లలో ఉంటుంది.

  1. మొదట ఈ-మెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

2. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల లోపు ఆన్ లైన్ క్విజ్ లో పాల్గొనాలి.

3. క్విజ్ చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్ లోకి లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషను నింపి సమర్పించాలి.

4. సంతకం చేసిన కాపి మరియు అన్ని డాక్యుమెంట్లు/సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.

దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.isro.gov.in/capacity-building/yuvika-yuva-vigyani-karyakram-young-scientist-programme

https://www.isro.gov.in

మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

లేదా

మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

THANK YOU.

error: Content is protected !!