HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
కౌంటింగ్ మొదలు పెట్టడానికి ముందు ప్రతి EVM యొక్క కంట్రోల్ యూనిట్ ID నంబర్, పింక్ పేపర్ సీల్ నెంబర్ మరియు గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ నిర్ధారించుకుంటారు.
రిటర్నింగ్ అధికారి ఈ రికార్డ్ ని అభ్యర్థికి అందజేయవలిసి ఉంటుంది. అభ్యర్థి తరుపు ఏజెంట్లు వీటిని సరిచూసుకుంటారు.
కంట్రోల్ యూనిట్ పై కనిపించే పోలింగ్ ప్రారంభించిన తేది, సమయం మరియు పోలింగ్ ముగిసిన తేదీ, సమయంను రికార్డ్ లో ఉన్న సమయంతో సరిచూసుకుంటారు.
ఇండియన్ స్టాండర్డ్ టైం తో ఈ సమయాలలో ఏదైనా తేడా ఉంటె మాక్ పోల్ సర్టిఫికేట్ పై ఉన్న తేది, సమయాలతో సరిచూసుకుంటారు.
ఒక వేళ మాక్ పోల్ తేదీ, సమయంలో ఉన్న తేడాతో పోలింగ్ స్టార్ట్ & ఎండ్ సమయం తో సరిపోకుంటే ఆ మిషన్ ను ప్రక్కకు పెట్టి ఎలక్షన్ కమీషన్ కు నివేదిస్తారు.
పోలింగ్ ముగిసిన తరువాత క్లోజ్ బటన్ నొక్కని కారణాన ఏదైనా కంట్రోల్ యూనిట్ రిజల్ట్ ను డిస్ ప్లే చేయకపోతే దానిని తిరిగి క్యారియింగ్ కేసులో పెట్టి రిటర్నింగ్ అధికారి కస్టడిలో కౌంటింగ్ హాల్ లోనే ఉంచుతారు.
మిగతా మిషన్ల కౌంటింగ్ యధావిధిగా జరుపుతారు.
మొత్తం కౌంటింగ్ పూర్తయిన తరువాత పక్కన పెట్టిన మిషన్ల టోటల్ బటన్ ను నొక్కి అందులో పోల్ అయిన ఓట్లు ఫారం – 17C లో రికార్డ్ చేసిన పోల్ అయిన ఓట్లతో సరిచూసుకొని తదుపరి రిజల్ట్ బటన్ ను నొక్కి అభ్యర్థులకు వచ్చిన ఓట్లను నిర్ధారించుకుంటారు.దీని విషయమై ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ ను రిటర్నింగ్ అధికారి మరియు అబ్జర్వర్ ఎలక్షన్ కమీషన్ కు నిర్దిష్టమైన ఫారం లో సమర్పిస్తారు.
ఒక వేళ ఆయా మిషన్ల లోని పోల్ అయిన మొత్తం ఓట్లు, 17C లో రికార్డ్ చేయబడ్డ పోల్ అయిన ఓట్లతో సరిపోకుంటే ఎన్నికల కమిషన్ నిర్ణయానికి రిపోర్ట్ చేస్తారు.
ఏదైనా కంట్రోల్ యూనిట్ రిజల్ట్ ను డిస్ ప్లే చేయకపోతే దానిని తిరిగి క్యారియింగ్ కేసులో పెట్టి రిటర్నింగ్ అధికారి కస్టడిలో కౌంటింగ్ హాల్ లోనే ఉంచుతారు.మిగతా మిషన్ల కౌంటింగ్ యధావిధిగా జరుపుతారు.
చివరలో ఈ మిషన్ల కు సంబంధించిన రిజల్ట్ ను ఆఫీసర్ BEL/ECIL ఇంజనీర్ల సహకారంతో యాగ్జిలరీ డిస్ ప్లే యూనిట్ ను ఉపయోగించి అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు.
కౌంటింగ్ ముగిసిన తరువాత అన్ని మిషన్లను క్యారియింగ్ కేసులో పెట్టి సీల్ వేస్తారు.
రిటర్నింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ ఆ సీళ్ల పై సంతకాలు చేస్తారు. అభ్యర్థుల ఏజెంట్లు కూడా సంతకాలు పెట్టడానికి అవకాశం ఉన్నది.
ఈ మిషన్లు అన్నింటిని స్తాంగ్ రూమ్ లో పెట్టి సీళ్లు వేస్తారు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.