COUNTING PROCEDURE VVPAT SLIPS COUNTING

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

VVPAT స్లిప్ ల వెరిఫికేషన్ కు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి 5 పోలింగ్ బూత్ లను ర్యాండం గా ఎంపిక చేస్తారు.

EVM ల ద్వారా కౌంటింగ్ చివరి రౌండ్ మరియు కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ డిస్ ప్లే కాని బూత్ ల VVPAT స్లిప్ ల లెక్కింపు తర్వాత మాత్రమె ఎంపిక చేసిన 5 పోలింగ్ బూత్ ల VVPAT లను లెక్కిస్తారు.

ఈ 5 పోలింగ్ స్టేషన్ లను రిటర్నింగ్ అధికారి, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు మరియు ఎన్నికల కమిషన్ ద్వారా నియమించబడిన నియోజక వర్గ పరిశీలకుడి సమక్షంలో ఎంపిక చేస్తారు.

చివరి రౌండ్ లెక్కింపు తర్వాత, ఆ అసెంబ్లీ నియోజక వర్గానికి నిర్దేశించిన కౌంటింగ్ హాల్ లో ఈ డ్రా ను చేపట్టుతారు.

రిటర్నింగ్ అధికారి డ్రా కు సంబంధించిన సమాచారంను తగినంత ముందుగా లిఖిత పూర్వకంగా అభ్యర్థులకు/ఏజెంట్లకు అందజేస్తారు.

పోస్ట్ కార్డ్ సైజు తెల్ల పేపర్ కార్డులను ఉపయోగిస్తారు.

ఆ అసెంబ్లీ నియోజక వర్గంలోని పోలింగ్ స్టేషన్ ల సంఖ్యకు సరిసమానంగా ఈ పేపర్ కార్డులు ఉంటాయి.

కంట్రోల్ యూనిట్ ద్వారా రిజల్ట్ డిస్ ప్లే కాని పోలింగ్ స్టేషన్ లను ఇందులో కలుపరు.

ఆ పేపర్ కార్డుల పైన అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య, పేరు, పోలింగ్ తేది ఉంటుంది. మధ్యలో పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉండును. పోలింగ్ స్టేషన్ నెంబర్ 1×1 సైజులో ఉంటుంది.

పోలింగ్ స్టేషన్ నెంబర్ కనబడకుండా ఈ పేపర్ కార్డును నాలుగు మడతలుగా పెడుతారు.

ప్రతి పేపర్ కార్డును అభ్యర్థికి/ఏజెంట్ కి చూపించిన తర్వాతనే మడత పెట్టి కంటైనర్ లో వేస్తారు.

ఈ పేపర్ కార్డులను ఒక పెద్ద కంటైనర్ లో పెట్టి బాగా కలిపినా తరవాత 5 పేపర్ కార్డులను తీస్తారు.

కౌంటింగ్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన VVPAT కౌంటింగ్ బూత్ లోనే VVPAT స్లిప్పులను లెక్కిస్తారు.

ఈ బూత్ ను బ్యాంక్ క్యాషియర్ క్యాబిన్ తరహ లో వైరుతో నిర్మించి, అనధికార వ్యక్తుల చేతికి VVPAT స్లిప్ చిక్కకుండా ఏర్పాటు చేస్తారు.

కౌంటింగ్ హాలులోని ఒక కౌంటింగ్ టేబుల్ ను కూడా, EVM ల లెక్కింపు తర్వాత ఇందుకు అనువుగా మార్చుకోవచ్చు.

ర్యాండం గా ఎంపిక చేసిన 5 పోలింగ్ బూత్ ల VVPAT స్లిప్ లను ఒకటి తర్వాత ఒకటిగా బూత్ ల స్లిప్పులను ఎన్నికల కమీషన్ నిర్దేశించిన విధంగా తూచ తప్పకుండా  లెక్కిస్తారు.

రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టంట్ రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

ఎన్నికల కమిషన్ పరీశిలకుడు ఈ మొత్తం ప్రక్రియను సజావుగా జరిగే విధంగా చూస్తారు.

ఒక వేళ EVM కౌంట్ కు, VVPAT స్లిప్ ల కౌంట్ కు తేడా వస్తే VVPAT స్లిప్ ల రీ కౌంటింగ్ జరుపుతారు.

EVM కౌంట్ కు సరిపడేవరకు లేదా అంతకుముందు స్లిప్పుల లెక్కింపు లో వచ్చిన సంఖ్యకు సరిపడే వరకు లెక్కిస్తారు.

EVM కౌంట్ కు మరియు VVPAT స్లిప్ ల కౌంట్ కు తేడా వస్తే VVPAT స్లిప్ ల కౌంట్ నే పరిగణన లోకి తీసుకుంటారు.

దానికి అనుగుణంగా రిజల్ట్ షీట్ లో మార్పులు చేస్తారు.

ఈ మొత్తం ప్రక్రియ విడియో చిత్రీకరణ సమక్షం లో చేస్తారు.

ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి ప్రతి బూత్ వారీగా ANNEXURE -A ఫార్మాట్ లో ఒక సర్టిఫికేట్ CEO కు సమర్పిస్తారు. CEO కౌంటింగ్ ముగిసిన 7 రోజులలో ఎన్నికల కమీషన్ కు సమర్పిస్తారు.

కమిషన్ చే నిమమించబడిన పరిశీలకులు కూడా జోనల్ సెక్రెటరీ ల ద్వారా ANNEXURE-B ఫార్మాట్ లో కమీషన్ కు నివేదికను అందచేస్తారు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!