MS BADI.COM అనగా MY SERVICE TO BADI.
వివరంగా చెప్పాలంటే బడికి నాయొక్క సేవ. ఇక్కడ నేను అంటే కేవలం నేను మాత్రమే కాదు. మా వెబ్ సైట్ ని ఆదరించే అందరూ .. అని అర్థం.
ఎందుకంటే మేము ఏది చేసిన ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే మా లక్ష్యం.
పది మందికి చేయూత ఇచ్చిన చాలు
సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడవోయ్ ….అన్న గురజాడ మాటలే మాకు ఆదర్శం.
ఈ వెబ్ సైట్ ద్వారా మేము అందిస్తున్న సేవలు.
1 ప్రభుత్వ బడులకు మౌళిక వసతుల కల్పన.
2 ఆపద, అవసరంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులకు ఆర్థిక చేయూత.
3 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక చేయూత.
4 ప్రభుత్వ పాఠశాలలకు మెడికల్ కిట్స్, TLM అందించడం.
5 రాష్ట్రంలో ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా పైన తెలిపిన సేవలను కొనసాగించడం.
పై వాటన్నింటిని మేము చేశాము అని చెప్పాలంటే అందుకు సాక్ష్యం….ఈ వెబ్ పేజి కూడా సరిపోదు.
మా సేవలు 10,000 వాట్స్ అప్ గ్రూప్ లలో రోజూ వెళతాయి. MDC పద్ధతిలో మా మెసేజ్ లు అన్ని వేళలా అందుబాటులోకి వస్తాయి.
మేము మా వెబ్ సైట్ ద్వారా చేసిన సేవలలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము.
MPPS కొత్తపేట ఒడ్డెర కాలనీ పాఠశాలకు వెల్ కం గేటు ఏర్పాటు.

MPPS కొత్త పేట ఒడ్డెర కాలనీ పాఠశాలలో చిత్రాల పెయింటింగ్ .


రోజుకో తినే ఆహరం కార్యక్రమం

ZPHS భూపతిపూర్ లో జరిగిన రాయికల్ – మండల స్థాయి మేళాకు 8000 రూపాయల షీల్డ్ లను అందించడం.

TSCPSEU జగిత్యాల సంఘం తో కలుపుకొని 1000 పాఠశాలలకు మెడికల్ కిట్స్ అనే కార్యక్రమం ప్రారంభం

TPTF సిరిసిల్ల సంఘం తో కలుపుకొని మెడికల్ కిట్స్ అందించడం.

TRTF జగిత్యాల సంఘం తో కలుపుకొని మెడికల్ కిట్స్ ఇవ్వడం.

PRTU కోరుట్ల సంఘం తో కలుపుకొని మెడికల్ కిట్స్ ఇవ్వడం.
ఫోటో లు అందుబాటులో లేవు. PRTU కోరుట్ల మండల శాఖ అధ్యక్షులు 9441974863 గారిని సంప్రదించండి.
రాయికల్ మండల ఉపాధ్యాయులకు, గౌరవ జగిత్యాల జిల్లా DEO జగన్ మోహన్ రెడ్డి గారిచే మెడికల్ కిట్స్ పంపిణీ

ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న ఉపాధ్యాయునికి ఆర్థిక చేయూత
CLICK HERE- ఇక్కడ క్లిక్ చేయండి.
అమ్మ నాన్నలను కోల్పోయిన మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఆర్థిక చేయూత
CLICK HERE- ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల ద్వారా మేము కొన్ని లక్షల రూపాయలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందించుట .
CLICK HERE- ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్నో పాఠశాలలకు నోట్ బుక్ లు, పెన్నులు అందించాము.
ఇంకా చాలానే ఉన్నాయి…సదా సేవలో..మీ అడ్మిన్
కరోనా సమయం నుండి ప్రాథమిక పాఠశాలలకు అవసరం అయిన డిజిటల్ వర్క్ షీట్స్, పాఠ్య ప్రణాళికలు, డిజిటల్ కంటెంట్ మా MSBADI వెబ్ సైట్ ద్వారా మాత్రమే అందించాము. అందిస్తున్నాము. మేము తయారు చేసిన డిజిటల్ వర్క్ షీట్స్ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి గడపను చేరాయి.
మా మెసేజ్ 90% ప్రభుత్వ ఉపాధ్యాయులను చేరుతుంది.
చేయూతనివ్వండి. పదింతలు తిరిగి ఇస్తాము…
మా సేవలు మిగతా అన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా మరింత అందుబాటులోకి తెస్తాము.