HI EVERYONE. WEL COME TO MS BADI.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న పారిశుధ్య కార్మికులకు CM కెసిఆర్ తీపి కబురు చెప్పారు.
మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి-పారిశుధ్య కార్మికులకు 1000 రూపాయల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఈ పెరిగిన జీతం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా 6 వేల 474 మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది.
GHMC తో పాటు రాష్ట్రం లోని అందరూ పారిశుధ్య కార్మికులకు ఈ పెరిగిన జీతం వర్తిస్తుందని తెలిపారు.
ఈ వార్తతో గ్రామ పంచాయితీ లో పనిచేస్తున్న కారోబారీ, వాటర్ సప్లై, బిల్ కలెక్టర్, పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న గౌరవ వేతనంతో పాటు అదనంగా 1000 రూపాయలను అందచేయనున్నారు.
వీరితో పాటు RTC కార్మికులకు కూడా వేతనం పెంచాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
పెరిగిన వేతనంకు సంబంధించిన జీవో లను ఇక్కడ చూడవచ్చు.
ముఖ్య సమాచారం కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.