VANDHE BHARATH EXPRESS SECUNDERABAD TO VISAKHAPATNAM

HI EVERYONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సీరిస్ లో భాగంగా మరియొక రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం ల మధ్య అందుబాటులోకి వచ్చింది.

ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారుచేసిన రైలు ఇది.

ఇది ఒక సెమి హై స్పీడ్ రైలు. గరిష్టంగా 160 km/h స్పీడ్ తో నడువగలదు.

ఈ రైలు కేవలం 8 గంటలలోనే సికింద్రాబాద్-విశాఖపట్నం ల మధ్య ప్రయాణిస్తుంది.

వారంలో 6 రోజులు నడుస్తుంది.

దీనిని  ICF- Integral Coach Factory, చెన్నై వారు  తయారు చేశారు.

దేశంలోనే 8వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇది.

దక్షిణ భారతదేశంలో 2వ సర్వీస్ ఇది. ఇదివరకే చెన్నై-మైసూర్ ల మధ్య మొదటి సర్వీస్ నడుస్తుంది.

ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును తేది 15-01-2023 ఆదివారం సంక్రాంతి పండుగ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి- అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తేది 16-01-2023 సోమవారం నుండి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగే స్టేజిలు

వరంగల్
ఖమ్మం
విజయవాడ
రాజమండ్రి

ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేకతలు

అత్యాధునిక సీటింగ్ విధానం

సెక్యురిటీ ఫీచర్స్

ఎమర్జెన్సీ అలారం

ఎమర్జెన్సీ టాక్ బాక్ యూనిట్

CC కెమెరాలు

అధునాతన టాయిలెట్ సిస్టం(పిల్లలకు-పెద్దలకు-వికలాంగులకు)

ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 16 భోగీలు (ఏసీ, నాన్ ఏసీ)  ఉన్నాయి.

ఇందులో 14 ఏసీ చైర్ కోచ్ లు, 2 కంపార్ట్ మెంట్ లు ఉన్నాయి.

ఇందులోనే చైర్ కార్, ఎగ్స్జిక్యూటివ్ చైర్ కార్ అనే రెండు తరగతులలో చార్జీలు ఉన్నాయి.

ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణించవచ్చు.

విశాఖపట్నం- సికింద్రాబాద్ ల మధ్య నడిచే రైలు నెంబర్ 20833

సికింద్రాబాద్-విశాఖపట్నం ల మధ్య నడిచే రైలు నెంబర్ 20834

ఈ రైలు చార్జీల వివరాలు

S.Noప్రయాణ ప్రదేశాలుచైర్ కార్ చార్జీ ఎగ్స్జిక్యూటివ్
1సికింద్రాబాద్-వరంగల్520 రూ.1005 రూ.
2సికింద్రాబాద్-ఖమ్మం750 రూ.1460 రూ.
3సికింద్రాబాద్-విజయవాడ905 రూ.1775 రూ.
4సికింద్రాబాద్-రాజమండ్రి1365 రూ.2485 రూ.
5సికింద్రాబాద్-విశాఖపట్నం1665 రూ.3120 రూ.

S.Noప్రయాణ ప్రదేశాలుచైర్ కార్ చార్జీ ఎగ్స్జిక్యూటివ్
1విశాఖపట్నంరాజమండ్రి625 రూ.1215 రూ.
2విశాఖపట్నంవిజయవాడ960 రూ.1825 రూ.
3విశాఖపట్నంఖమ్మం1115 రూ.2130 రూ.
4విశాఖపట్నంవరంగల్1310 రూ.2540 రూ.
5విశాఖపట్నంసికింద్రాబాద్1720 రూ.3170 రూ.

ప్రయాణ సమయం వివరాలు

విశాఖసికింద్రాబాద్
( 20833 )
సికింద్రాబాద్-విశాఖ
( 20834 )
విశాఖపట్నం-5:45సికింద్రాబాద్-15:00
రాజమండ్రి-7:55వరంగల్-16:35
విజయవాడ-10:00ఖమ్మం-17:45
ఖమ్మం-11:00విజయవాడ-19:00
వరంగల్12:05రాజమండ్రి-20:58
సికింద్రాబాద్-14:15విశాఖపట్నం-23:30

సికింద్రాబాద్-విశాఖపట్నం ల మధ్య నడిచే వందే భారత్ రైలు వివరాలను వీడియో రూపంలో కూడా చూడవచ్చు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!