HI EVERY ONE. WEL COME TO MS BADI
నేను మీ మహేష్ మాచర్ల ..అకాల వర్షాల నేపథ్యంలో రాసిన కవితను చదవండి.
THANK YOU
********************
ఓ వర్షమా.. రేపు రాకు!
వంద ఏళ్ల చరిత్రలో లేదిది.
బడి లేదు గుడి లేదు.
కూలీ నాలీ లేనే లేదు.
చెరువు కట్టలు,మత్తడి పొంగులు.
కాలువ గట్లు,ప్రాజెక్టు గేట్లు
నీరు నిండిన ఊర్లు.
ఆగమాగం అయినయి.
అసలే కరోనా కష్టాలు,
చదువు లేదు, సంధ్య లేదు.
కడు పేద వానికి,
గూడు, కూడు లేనే లేదు.
అలుపెరగని నీ రాకతో,
పశు పక్ష్యాదుల జాడ లేదు.
ఉన్నకాన్నే ఉండుకుంట,
తినుకుంట పండుకుంట,
ఫోన్ చేతిలో పట్టుకుంట,
ఒకరి మొఖం ఒకరు చూసుకుంట
ఇంటిలోన ఖైదు చేస్తివి.
ఆగిన రోడ్లు
నిండిన మోర్లు
దొరకని కల్లు
ఇంగ్లీష్ బ్రాండ్లు
జేబుకు చిల్లులు.
ఆగని వానలో అమ్మల ముగ్గులు,
అలుపెరుగని అయ్యల పెగ్గులు
బయటకెళ్ళని పిల్లల అల్లరి,
ఆగిన దందాలు, బజారు అందాలు,
ఇంకా ఎప్పటిదాకా…
కరెంటు కష్టాలు, కొట్టుక పోతలు,
ఊరుతున్న చూరు, పారుతున్న యేరు,
పగిలిన గుండెలు, మిగిలిన శోకాలు,
ఆగేదెప్పుడు..ఇంకెప్పుడూ
అందుకే ఓ వర్షమా….రేపు రాకు!
-వెలుగు(BRIGHT YOURSELF)
విద్యా, ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :-
లేదా
విద్యా, ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.