HI EVERY ONE. WEL COME TO MS BADI.
MJPTBCW అనగా మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.
2022-23 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.
ఎవరు అర్హులు:-
BC, SC, ST, EBC విద్యార్థులు అర్హులు.
6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2021-22 సం.లో 5వ తరగతి చదివి ఉండాలి.
7వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2021-22 సం.లో 6వ తరగతి చదివి ఉండాలి.
8వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2021-22 సం.లో 7వ తరగతి చదివి ఉండాలి.
6వ తరగతికి 31-08-2022 నాటికి 12 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.
7వ తరగతికి 31-08-2022 నాటికి 13 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.
8వ తరగతికి 31-08-2022 నాటికి 14 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.
ఆదాయ పరిమితి:-
విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతంలో RS. 1,50,000/- మరియు పట్టణ ప్రాంతంలో RS. 2,00,000/- కు మించరాదు.
ప్రవేశ పరీక్ష తేదీ:-
19-06-2022 రోజున ఉదయం 10:౦౦ గంటల నుండి మధ్యాహ్నం 12:౦౦ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.
పరీక్ష విధానం:-
పరీక్ష ప్రశ్నా పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.
ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నా పత్రం ఉంటుంది.
మొత్తం మార్కులు=100.
తెలుగు-15 మార్కులు
గణితం-30 మార్కులు
సామాన్య శాస్త్రం-15 మార్కులు
సాంఘీక శాస్త్రం-15 మార్కులు
ఇంగ్లీష్-25 మార్కులు
దరఖాస్తు చేయు విధానం:-
తెలంగాణ ఆన్ లైన్ కి ప్రాథమిక వివరాలు అనగా విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి 100 రూపాయలు చెల్లించాలి. ఒక జర్నల్ నెంబర్ వస్తుంది.
ఆ జర్నల్ నెంబర్ తో mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:-
02-06-2022
మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
లేదా
మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
THANK YOU.