IMPORTANT INSTRUCTIONS TO HEADMASTERS AND TEACHERS AFTER HEAVY RAINS

HI EVERYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

అన్నీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అత్యంత ముఖ్య సూచనలు:-

భారీ వర్షాలు, వరదల అనంతరం పాఠశాల ప్రారంభ సందర్భం లో కింది జాగ్రత్తలు, సూచనలు పాటించగలరు.

వరద ముంపు కు గురి అయిన పాఠశాలలు తీసుకోవలసిన జాగ్రత్తలు. 

1) పాఠశాల లో చేరిన బురద, ఇతర చెత్త ను స్థానిక లైన్ డిపార్ట్మెంట్ సహాకారం తో శుభ్రపరచుకోగలరు. 

2) విద్యార్ధులు వచ్చేవరకు  పాఠశాలలను బోధనకు అనుగుణంగా సిద్ధగపరచగలరు .

3) తడిచిన అడ్మిషన్ రిజిస్టర్స్, హాజరు పట్టికలు, ఇతర ముఖ్యమైన రికార్డులను డ్రై ట్రీట్మెంట్ చేయగలరు. 

4) మధ్యాహ్న భోజన పథకం బియ్యం తడిచినట్లయితే వాటిని భోజనం కొరకు వాడకండి. 

5) వరద ముంపు కు గురి అయిన పాఠశాల భవనం soundness పరిశీలించి ప్రమాదకరంగా వుంటే వాటిలో విద్యార్థులను కూర్చోబెట్టకండి.  వీలు అయితే వాటిని పంచాయితీ రాజ్ ఇంజనీర్ తో పరీక్షింపచేయండి.  

6)   వరద ముంపు కు గురి అయిన పాఠశాల భవనాలు, గోడల పగుళ్ళలో వరద ద్వారా వచ్చిన విషపు జంతువులు చేరే అవకాశం వుంది కాబట్టి. ప్రతి గోడ మూలల్లో , భవనాల వద్ద, ఇతర ప్రదేశాలలో క్షుణ్ణంగా పరిశీలించండి. 

7) టాయిలెట్స్, యూరినల్స్ వంటివి మూసుకుపోయినట్లయితే వాటిని బాగు చేయించండి. 

8) బురద ఎక్కువగా వున్న ప్రాంతాలలో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం వుంది కాబట్టి వెంటనే శుభ్రపరచండి. పంచాయితీ వారి సహకారం తో బ్లీచింగ్ / సున్నం వంటివి చల్లించండి.

9) నీటి నిల్వ వుంటే డ్రైన్ చేయించండి.  లేకపోతే దోమలు పెరిగే అవకాశం వుంది. 

10) ఉపాధ్యాయులు అందరు పాఠశాలకు హాజరు అయ్యి పాఠశాలను బోధనకు అనుగుణంగా సిద్ధపరచుకోగలరు. 

ఇతర జాగ్రత్తలు :

భారీ వర్షాల అనంతరం,   పాఠశాల ప్రారంభం విషయం లో కింది జాగ్రత్తలు అందరు ప్రధానోపాధ్యాయులు విధిగా పాటించగలరు. 

1) పాఠశాల పై కప్పులపై నీరు నిలువ వుండినట్లయితే వెంటనే దానిని తొలగించగలరు. పాఠశాల పై కప్పులపై ఎటువంటి చెత్త, ఆకులు నిలువ వుండకుండా వెంటనే తొలగించండి. 

2) మన ఊరు – మన బడి సివిల్ పనులు జరుగుతున్న పాఠశాలల్లో గోతులు వంటి వాటి వాటిల్లో నీరు నిల్వ వున్నట్లయితే వెంటనే తొలగించండి.  పిల్లలను వాటి వద్దకు వెళ్ళకుండా చూడండి. 

3) శిథిలావస్థ లో వున్న ప్రహరీ గోడలు, పాఠశాల గదుల వద్దకు పిల్లలని వెళ్ళనీయకండి. 

4) తడచిన  గది  గోడల ను అనుకోని పిల్లలను కూర్చోనియకండి .  ఎలక్ట్రిసిటీ ప్రవహించే అవకాశం వుంది. 

5) స్విచ్ బోర్డుల నుండి వైర్లు వేలాడకుండా చూడండి.  పిల్లలని స్విచ్ బోర్డుల వద్దకు వెళ్ళనీయకుండా చూడండి.  వారిని స్విచ్ లు వేయమని చెప్పకండి. 

6) తరగతి గది  లో ఏవైనా రంధ్రాలు వున్నట్లయితే వాటిని జాగ్రత్త గా పరిశీలించండి.  వాటిలో విషపు  పురుగులు, తేళ్ళు, పాములు చేరే అవకాశం వుంది.  గోడ వారీగా జాగ్రత్త గా పరిశీలించండి.  చిన్న పిల్లలను వాటిలో చేతులు పెట్టకూడదని చెప్పండి. 

7) MDM వండే  సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. 

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!