ABOUT BIPIN RAWAT

  • అందరి వాట్సప్ స్టేటస్ లో కనిపిస్తున్న ఈ బిపిన్ రావత్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాము.
  • తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి కొండల్లో నిన్న అనగా 8 డిసెంబర్,2021న  జరిగిన  హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఎక్కడ చూసినా బిపిన్ రావత్ పేరు వినిపిస్తుంది.
  • ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఈయనే.
  • ఈయన భారత దేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి ( CDS-చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ).  
  • బిపిన్ రావత్ అసలు పేరు-బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్.
  • పుట్టిన తేదీ- 1958 మార్చి 16.
  • జన్మస్థలం-ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని పౌరీ
  • కుటుంబ నేపథ్యం- రాజపుత్ర కుటుంబం
  • తండ్రి పేరు- లక్ష్మణ్ సింగ్ రావత్
  • ఈయన తండ్రి గారు భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ గా దేశానికి సేవలందించారు.
  • భార్య పేరు- మధులిక
  • సంతానం- ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.
  • దేశానికి అందించిన సేవలు

-ఇండియన్ ఆర్మీ లో చేరిన తేది- 1978 డిసెంబర్ 16

-11 గూర్ఖా రైఫిల్స్ 5వ బెటాలియన్ లో సేవలు

-మేజర్ జనరల్ జనరల్ స్టాఫ్ గా సేవలు

-లెఫ్టినెంట్, ఆర్మీ కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియార్, లెఫ్టినెంట్ జనరల్ గా భాద్యతలు

  • నేపాల్ ఆర్మీ కి గౌరవ జనరల్ కూడా ఈయనే..
  • పొందిన ఆవార్డులు-

-పరమ విశిష్ట సేవా పతకం

-ఉత్తమ యుద్ధ సేవా పతకం

-యుద్ధ సేవా పతకం

-సేన పతకం

-విశిష్ట సేవా పతకం

-అతి విశిష్ట సేవా పతకం మొదలగునవి ఆయన అంకిత భావానికి గీటురాళ్ళు.

  • దేశం కోసం ఆయన అందించిన సేవలు ఎంతో కొనియాడదగినవి.
  • మరణించే నాటికి ఈయనకి 63 సంవత్సరాలు.
error: Content is protected !!