TG TET 2026 CANDIDATES INSTRUCTIONS IN TELUGU AND ENGLISH

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS


LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS


SPOKEN ENGLISH DAY 1-187


TS TEACHERS TRANSFERS

USEFUL FORMS FOR TEACHERS

LATEST UPDATES

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

తేది జనవరి 3, 2026 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా TET పరీక్ష జరుగనున్నది.

అభ్యర్థులకు సూచనలు ఇక్కడ తెలుపడం జరిగింది.

ALL THE VERY BEST.

హాల్ టికెట్ లో ఇచ్చిన అభ్యర్థికి సంబంధించిన సమాచారం అభ్యర్థి ఆన్లైన్ లో అప్లికేషన్ ద్వారా సమర్పించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఆమె / అతను చేసిన ఎంట్రీ లకు అభ్యర్థి మాత్రమే బాధ్యత వహిస్తారు.

అభ్యర్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందుగా హాల్ టికెట్ తో పాటు పరీక్షా కేంద్రంలో హాజరు కావాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులెవరు అనుమతించబడరు. అంటే ఉదయం 7.30 ( ఉదయం సెషన్ ) లేదా మధ్యాహ్నం 12.30 _( మధ్యాహ్నం సెషన్ ).

అభ్యర్థులు ఎవరైనా చేతులకు మెహంది,ఇంకు పెట్టుకుంటే, వారు లోనికి అనుమతి లేదు.

మధ్యాహ్నం 11.30 గంటలకు ( ఉదయం సెషన్ ) మరియు సాయంత్రం 4.3౦ గంటలకు ( మధ్యాహ్నం సెషన్ ) ముందు పరీక్ష హాలు నుండి బయటికి వెళ్ళడానికి అభ్యర్థులెవరు అనుమతించబడరు.

లాగరిథం పట్టికలు, కాలిక్యులేటర్ , పేజర్, సెల్ ఫోన్ (స్విచ్ ఆఫ్ మోడ్ లో కూడా ) లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటితో సహా ఇతర గణన పరికరాల ఉపయోగం అనుమతించబడదు.

అభ్యర్థులకు వైట్ పేపర్ లు ఇస్తారు. ( రఫ్ వర్క్ కోసం ). వాటిని తిరిగి ఇన్విజి లెటర్ కు తప్పకుండా అందజేయాలి.

పరీక్షా హాల్ లో ఏమైనా అవాంచనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై యాక్ట్ 25/97 కింద కేసు బుక్ చేయబడును.

OMRషీట్ లో గుర్తు పెట్టడానికి ప్రతి అభ్యర్థి తమ వెంట 2 చక్కటి బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్ మరియు ఏదైనా గుర్తింపు కార్డ్ ( ఆదార్ కార్డ్, పాన్ కార్డు, ఇతరములు..) మాత్రమె తీసుకొని రావాలి.ఏ ఇతర రంగు పెన్ను అనుమతించబడదు.

అభ్యర్థి పేపర్ కు సమాధానం ఇవ్వడం ప్రారంభించే ముందు OMR జవాబు పత్రం యొక్క సైడు-1 లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి, అనుసరించాలి.

దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు (40 % మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు ) లేఖకుల సాయంతో అనుమతించ బడుతారు.

ప్రశ్నల ఇంగ్లిష్ మరియు లాంగ్వేజ్ I వెర్షన్ల మధ్య ఏదైనా వ్యత్యాసం లేదా అనువాదంలో చిన్న పొరపాట్లు ఉన్నా, ఇంగ్లిష్ వర్షన్ నే ఫైనల్ గా పరిగణించబడుతుంది.

  1. The information pertaining to the candidates given in the Hall Ticket is as submitted by the candidates through ONLINE application for TGTET-2026. Hence, candidates alone are responsible for the entries made by her / him.
  1. The candidate’s eligibility for TGTET-2026 is not verified at the time of ONLINE application. Issue of Hall Ticket and appearance at the test does not automatically entitle the Applicant’s eligibility for TGTET-2026.
  1. Candidate shall be present with the Hall Ticket at the examination centre Two hours before the time of the exam. Candidates who fail to produce Hall Ticket will not be allowed to appear for the examination.
  1. Candidate will be permitted into the Examination Hall from 7:30 AM for Morning Session and 12:30 PM for Afternoon Session for capturing Biometric Information (Photo and Thumb impression). Candidates are advised not to apply any external material like Mehandi, Ink etc, on Hands.
  1. Candidate will NOT be permitted into the Examination Hall after the gate is closed i.e.,8:45 AM for Morning Session and 1:45 PM for Afternoon Session. Candidates will NOT be allowed to leave the examination hall until the test is completed i.e., 11:30 PM for Morning Session or 04:30 PM for Afternoon Session.
  1. Candidates shall carry into the Examination hall (i) Black/Blue Ball Point Pen (ii) Hall Ticket and (iii) Valid Original photo identification card (Aadhaar Card/Driving License/Passport/PAN Card/Voter ID).
  1. The use of calculating devices including logarithm tables, calculator, pager, cell phone (even in switch off mode), smart watches, or any other electronic devices or carrying of loose sheets of paper to examination hall are not allowed.
  1. Blank (White) papers will be provided for rough work in the examination hall. Candidates have to hand over the rough sheets to the invigilator concerned after the end of the examination.
  1. Candidate shall listen to the instructions announced by the Invigilator carefully. After login, candidate shall read the instructions carefully especially the list of symbols related to answering the online examination. No clarifications or doubts related to the questions of the examination paper will be entertained during the examination.

10.In case candidate detects any hardware or software problems with the computer provided, she / he may raise hand and talk to the invigilator. The problem will be rectified immediately. Incase the problem is not rectified within a reasonable time; the computer will be changed for that candidate. Countdown timer stops during the change, so candidate will not lose any time during the process of changing the computer.

  1. Adoption of any kind of unfair means and any act of impersonation during the time of test will render the candidate liable for invalidation of his / her examination. Further he/she will forfeit the claim of appearing for the test and a case of malpractice will be booked against the candidate under the Public Examination prevention of malpractices and unfair means act 25 / 97.
  1. Candidate is advised to visit the Examination Centre well in advance to familiarize with the location of the Examination Centre.
  1. Hall Ticket may be preserved for future usage as TGTET-2026 scores are valid for lifetime.
  1. Visually Impaired candidates (40% and above disability) and Orthopedically Handicapped (40% and above disability) are allowed the assistance of a scribe. (As per DEPwD’s OM No. 29-6/2019-DD-III dated 10.08.2022)
  1. In case of any discrepancy between the English and language I versions of the questions or incase of minor errors in translation, English version shall be considered as final.
  1. Candidates shall follow the website for any updates after the examination including release of key and results.
  1. Examination centers do not have security facility for safekeeping of candidate’s valuable devices or personal belongings. The examination Center does not bear any responsibility for loss of valuable devices or personal belongings. Hence, candidates are advised not to carry any valuable devices / things to the examination centre.

👉 సెంటర్ యొక్క లొకేషన్ ఒకరోజు ముందే తెలుసుకోగలరు.

👉ఎగ్జామ్స్ సెంటర్ కు గంటన్నర ముందే చేరుకోగలరు (బయోమెట్రిక్ నిమిత్తం.)

👉ఒక బ్లాక్,ఒక బ్లూ రెండు పెన్నులు తీసుకొని వెళ్లగలరు

👉ఒరిజినల్ ఐడి కార్డు ఆధార్/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటర్ కార్డ్ లాంటివి ఏదైనా ఒకటి తీసుకుని వెళ్ళగలరు 

👉చేతులకు మెహేంది/ గోరింటాకు /కోన్ వంటివి వేసుకోకూడదు.

👉రఫ్ వర్క్ నిమిత్తము మనకు ఇన్విజీలేటర్స్ పేపర్లు ఇస్తారు. ఎగ్జామ్ ముగిసిన తర్వాత వాటిని వారికి అప్పగించాలి.

👉లాగిన్ విషయంలో ఇన్విజిలేటర్ల సహాయం తీసుకోవచ్చును.

👉పరీక్ష ముగిసే వరకు ఎగ్జామ్ హాల్ లోనే ఉండాలి.ముందే బయటకు రాకూడదు.

👉స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్ వంటివి తీసుకుని వెళ్ళకూడదు.

👉ఇన్విజిలేటర్ల సూచనలు తప్పక పాటించాలి.

👉 భవిష్యత్తులో అవసరాల నిమిత్తము మీ హాల్ టికెట్ను భద్రపరచుకోగలరు.

1)Hall Ticket

2) Blue, Black Pens

3)Photo ID card(Adhar/License/Voter card)

TET EXAM వ్రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు 𝗔𝗹𝗹 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁

 ఆందోళన చెందకండి..

భయపడాల్సింది అంతకన్నా లేదు..

 ప్రయత్నం చేయండి….

➡️కంప్యూటర్ ముందు ఖాళీగా కూర్చోకండి 

✅సమాధానం తెలియని ప్రశ్నను ఆలోచిస్తూ కూర్చోకండి.. ముందుకు సాగండి..

✅ సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ముందుగా ఆన్సర్ టిక్ చేయండి..

✅ ప్రశ్నలకు సమాధానాలు రాని.. వాటికి చివరి 30 నిమిషాలలో ఎదో ఒకటి పెట్టండి..

✅ మైనస్ మార్కులు లేవు కాబట్టి లాభం జరుగుతుంది.

➡️ ఎగ్జామ్స్ సెంటర్ కు 2 గంటల ముందు చేరుకోండి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది..

✅ మహిళా ఉపాధ్యాయులకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు.. కేవలం మెహందీ.. పెట్టుకోకండి.. బయోమెట్రిక్ లో ఇబ్బంది అవుతుంది.

➡️చివరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు వెంట తీసుకా వెళ్ళండి.. మర్చిపోవద్దు..

➡️సెల్ ఫోన్స్, ఇతర పేపర్లు అనుమతి లేదు..

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) అనేది కేవలం మీ జ్ఞానానికి పరీక్ష మాత్రమే కాదు, మీ సహనానికి మరియు ప్రణాళికాబద్ధమైన ఆలోచనకు నిదర్శనం. అభ్యర్థులు పరీక్షా ఒత్తిడిని జయించి, విజయం సాధించడానికి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి:

చాలా మందికి పరీక్షా కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో కేటాయించబడ్డాయి.

  లొకేషన్ చెకింగ్: గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ సెంటర్ ఎక్కడ ఉందో ముందే చూసుకోండి.

  ముందస్తు ప్రయాణం : వీలైతే పరీక్షకు ఒక రోజు ముందే ఆ పట్టణానికి చేరుకుని బస ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల ప్రయాణ బడలిక తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  సమయపాలన: పరీక్షకు కనీసం 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవడం అత్యుత్తమం.

పరీక్షా కేంద్రం వద్ద ఇబ్బంది పడకుండా ఈ క్రింది వాటిని ముందే బ్యాగులో పెట్టుకోండి:

  హాల్ టికెట్: కలర్ కాపీతో పాటు ఒక బ్లాక్ అండ్ వైట్ కాపీని కూడా ఉంచుకోండి.

https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

 గుర్తింపు కార్డు (ID Proof): ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు తప్పనిసరి.

 ఉపాధ్యాయులు అయితే తమ అధికారిక ఐడీ కార్డును కూడా వెంట ఉంచుకుంటే మంచిది.

  పెన్నులు: కేవలం బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.

 బయోమెట్రిక్ సమస్యలు: పరీక్షా కేంద్రంలో వేలిముద్రలు తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు (ముఖ్యంగా మహిళలు) చేతులకు మెహందీ (గోరింటాకు) పెట్టుకోవద్దు. దీనివల్ల బయోమెట్రిక్ సరిగ్గా పడక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

 నిషేధం: వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విలువైన ఆభరణాలు ధరించవద్దు.

  మొబైల్ ఫోన్లు: ఫోన్లను భద్రపరచడానికి పరీక్షా కేంద్రం వద్ద ఉన్న డిపాజిట్ కౌంటర్లను లేదా మీతో వచ్చిన మిత్రులను ఆశ్రయించండి.

కంప్యూటర్ పరీక్ష అనగానే భయపడాల్సిన పనిలేదు. ఇది ఓఎంఆర్ (OMR) షీట్ కంటే సులభం.

  వెసులుబాటు: మీరు గుర్తించిన సమాధానాన్ని మళ్ళీ మార్చుకునే అవకాశం ఇందులో ఉంటుంది.

 సహాయం: కంప్యూటర్ వాడకం తెలియని వారు అక్కడ ఉండే ఇన్విజిలేటర్ల సహాయం కోరవచ్చు.

  సమయం: పరీక్షా సమయం ముగియగానే స్క్రీన్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది.

  చివరి నిమిషం చదువు వద్దు: పరీక్షకు రెండు రోజుల ముందే కొత్త విషయాలు చదవడం ఆపేసి, ప్రశాంతంగా ఉండండి.

  సెలవు: ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పరీక్షకు రెండు రోజుల ముందే సెలవు తీసుకుని మానసికంగా సిద్ధమవ్వాలి.

ముగింపు: “టెట్ పరీక్ష అనేది మీ ఆశయ సాధనలో తొలి మెట్టు. ఏకాగ్రత మరియు క్రమశిక్షణే విజయానికి అసలైన సూత్రాలు. ప్రశాంతమైన చిత్తంతో పరీక్ష రాసి, ఉపాధ్యాయులుగా విజయం సాధించాలని మీ సహచర ఉద్యోగినిగా, నిరంతర విద్యార్థినిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.” విలువైన ఈ సమాచారాన్ని మిత్రులతో షేర్ చేసుకోగలరు.

  మాక్ టెస్ట్ ప్రాక్టీస్: ఆన్లైన్ పరీక్షా విధానంపై అవగాహన కోసం కనీసం 2-3 సార్లు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల మౌస్ క్లిక్ చేయడం, ‘Save & Next’ వంటి బటన్ల వాడకంపై భయం పోతుంది.

  ‘Review Later’ సౌకర్యం: ఏదైనా కష్టమైన ప్రశ్న ఎదురైతే సమయం వృధా చేయకుండా “Mark for Review” పెట్టుకోవాలి. ఇవి క్వశ్చన్ ప్యాలెట్‌లో వైలెట్ రంగులో కనిపిస్తాయి కాబట్టి చివర్లో సులభంగా గుర్తించవచ్చు.

 సమయ పాలన (Time Management): 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఉంటుంది.

    CDP, తెలుగు, ఇంగ్లీష్: 45-50 నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

   Maths & Content: వీటికి 60-70 నిమిషాల సమయం కేటాయించాలి.

స్క్రీన్ పై కుడివైపున ఉండే Timer ను గమనిస్తూ ఉండాలి.

 నేగటివ్ మార్కింగ్ లేదు: పరీక్షలో నెగటివ్ మార్కులు లేవు కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి.

 ఎలిమినేషన్ టెక్నిక్: ప్రశ్నలో “సరైనది ఏది?”, “సరైనది కానిది ఏది?” అనే పదాలను జాగ్రత్తగా గమనించాలి. తప్పు అనిపించే ఆప్షన్లను ముందుగా తొలగిస్తే సరైన సమాధానం దొరకడం సులభం అవుతుంది.

  రఫ్ వర్క్: గణితం, సైన్స్ లెక్కల కోసం ఇచ్చే స్క్రిబుల్ ప్యాడ్‌ను ఆర్గనైజ్డ్‌గా వాడాలి.

 సైకాలజీ (CDP): ఎప్పుడూ శిశు కేంద్రీకృత విద్యా (Child-Centered Education) కోణంలోనే ఆలోచించాలి. శిశువును దండించడం వంటి నెగటివ్ ఆప్షన్లను ఎంచుకోవద్దు.

 ఏకాగ్రత: పక్కవారి వేగాన్ని చూసి టెన్షన్ పడకుండా, మధ్యలో 2-3 సెకన్లు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండాలి.

 మార్పులు: OMR షీట్ లాగా కాకుండా, CBTలో సేవ్ చేసిన సమాధానాన్ని చివర్లో మార్చుకునే అవకాశం ఉంటుంది.

 గుర్తుంచుకోవలసినవి: పరీక్ష హాల్‌కు వెళ్లేటప్పుడు హాల్ టికెట్ మరియు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

సదా మీ సేవలో 🙏🏻

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

CLASSDOWNLOAD
1st CLASSDOWNLOAD
2nd CLASSDOWNLOAD
3rd CLASSDOWNLOAD
4th CLASSDOWNLOAD
5th CLASSDOWNLOAD

TG TET JAN 2026 HALL TICKETS

FLS MOCK TEST

FLS ITEM BANK

డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు

FLS పూర్తి సమాచారం

డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు

GROUP 3 PROVISIONAL SELECTION LIST

DOWNLOAD TG SET 2025 HALL TICKETS

NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY

NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS

NMMS 2025 FINAL KEY

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026

TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025

GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES

DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION

NMMS 2025 PRELIMINARY KEY

PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE

PREVIOUS TET HALL TICKETS AND RESULTS

CLASSDOWNLOAD
FOR CLASS-1CLICK HERE
FOR CLASS-2CLICK HERE
FOR CLASS-3CLICK HERE
FOR CLASS-4CLICK HERE
FOR CLASS-5CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!