HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(96) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
అబ్రహం లింకన్ అమెరికా యొక్క 16వ అధ్యక్షుడు, అంతర్యుద్ధంలో దేశాన్ని నడిపించి, బానిసత్వాన్ని రద్దు చేయడంలో అయన కీలక పాత్ర పోషించారు.
ఆయన తన కుమారుడు చదివే పాఠశాల ఉపాధ్యాయునికి రాసిన ఉత్తరమే….ఇందులోని సారాంశం.
HAPPY TEACHER’S DAY TO ALL…..
వాడు నేర్చుకోవాలని నాకు తెలుసు
మనుషులందరూ న్యాయంగా ఉండరని
మనుషులందరూ నిజాయితీగా ఉండరని.
మీరు నేర్పాలి వాడికి
దుర్మార్గుడూ ఉంటాడు, వీరుడూ ఉంటాడని
స్వార్థ రాజకీయవేత్త ఉంటాడు,
అంకితభావం గల నాయకుడూ ఉంటాడని…
శత్రువూ ఉంటాడు, మిత్రుడూ ఉంటాడని,
నేర్పండి మీకు వీలైతే –
కష్టపడి సంపాదించిన ఒక్కరూపాయి విలువ మిన్న
ఊరికే వచ్చే అయిదు రూపాయల కన్నా…
నేర్పండి వాడికి పోగొట్టుకోవడం ఎలాగో…..
అలాగే గెలుపుకి ఆనందించమని,
అసూయ నుంచి దూరంగా ఉండమని;
నేర్పండి వాడికి వీలైతే,
నిశ్శబ్దంగా నవ్వుకోవడంలోని రహస్యం.
మొదట్లోనే నేర్చుకోనివ్వండి
పుస్తకాలు అద్భుతమైన పని ….
నేర్పండి ఇంకా, కొంత సేపు ప్రశాంతంగా ఉండి
ఆకాశంలోని విహంగాను, సూర్యరశ్మిలోని భ్రమరాలు
పచ్చని కొండల పక్కన పూలు చూస్తూ,
లోతుగా ఆలోచించమని,
” పాఠశాలలో నేర్పండి
మోసం చేసే కన్నా తప్పడం గౌరవం అని
నేర్పండి వాడికి.
అందరూ వాటిని తప్పు అన్నా సరే,
తన భావాలపై తనకే నమ్మకం ఉండాలని
నేర్పండి వాడికి మర్యదస్తులతో మర్యాదగా మెలగాలని
మోటు వాళ్ళతో మోటుగా ఉండాలని
ఇవ్వడానికి ప్రయతించకండి మావాడికి
ప్రచార రథం వెనుక అందరితో పాటూ
మందలో చేరకుండా ఉండే శక్తిని,
నేర్పండి వాడికి ఎవరు చెప్పిన వినమని
ఇది కూడా చెప్పండి
విన్నదాన్నంతటినీ నిజం అనే జల్లెడలో వేసి
వచ్చిన మంచిని మాత్రమే స్వీకరించమని,
నేర్పండి వాడికి వీలైతే
విచారంగా ఉన్నప్పుడు నవ్వమని…
కన్నీటికి సిగ్గుపడక్కర్లేదని
నిరాశావాదులను వెక్కిరించమని,
అతి మధురంగా ఉన్న వాళ్ళ నుంచి జాగ్రత్త పడమని….
నేర్పండి వాడికి
తన కండ బలాన్నీ, మేధాశక్తినీ
ఎక్కువ ధర పలికే వాడికి అమ్ముకోమని,
కాని తన హృదయానికీ, వ్యక్తిత్వానికీ మాత్రం
వెల పెట్టవద్దని.
జనం గోలగా అరుస్తూంటే చెవులు
మూసుకోమని చెప్పండి వాడికి
తను మంచి అనుకున్న దానికోసం
నిలబడి పోరాడమని చెప్పండి.
వాడిని ప్రేమగా చూడండి
కాని వాడిని గారాబం చెయ్యకండి,
ఎందుకంటే, నిప్పులో కాలినప్పుడే
ఉక్కు బాగా తయారవుతుంది.
అసహనం చూపించగల విశ్వాసం ఉంచుకోనివ్వండి.
ధైర్యంగా ఉండేందుకు సహనం పెంచుకోనివ్వండి.
ఎల్లప్పుడూ వాడికి నేర్పండి తనలో తనకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలని ,
ఎందుకంటే అప్పుడు వాడికి
మానవ జాతిలో పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది.
ఇది పెద్ద పట్టిక, అయినా చూడండి మీరేం చెయ్యగలరో
వాడు ఎంత సుకుమారమైనవాడు,
చిన్నవాడు, మావాడు.
👉 తరగతిలోకి ప్రవేశించిన ఉపాధ్యాయుడు,పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ను కనపరచాలీ.ఎందుకంటే పిల్లవాడి కంటే సిలబస్ కానీ, సబ్జెక్టు కానీ ముఖ్యం కాదు. నీకు పిల్లవాడు మాత్రమే ముఖ్యమైనదిగా కనిపించాలీ తరగతి గదిలో.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(96) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



