ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు ఈ ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా జిల్లా మెడికల్ బోర్డు నుండి మెడికల్ సర్టిఫికేట్ పొందడానికి కింది సూచనలను పాటించండి.
- ముందుగా మీరు ఉదయం వేళనే సంబంధిత జిల్లా మెడికల్ బోర్డు / సివిల్ హాస్పిటల్ కు వెళ్ళండి.
- మీ పై అధికారి / HM గారి నుండి మీకు ఫలానా మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంది అని ఒక ఫార్వార్డింగ్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. లెటర్ నెంబర్ తప్పకుండా వ్రాయాలి అందులో.( మెడికల్ సుపరింటెండెంట్ గారికి )
- ఆ లెటర్ పై మీ ఆఫీస్ ముద్ర తప్పకుండా ఉండాలి.
- మీరు వ్యక్తిగతంగా ఒక లెటర్ ను మెడికల్ సుపరింటెండెంట్ గారికి రాయాలి.
- వెళ్ళిన హాస్పిటల్ లో ఒక O.P తీసుకోవాలి.
- మీరు ఇంతకుముందు వెళ్ళిన హాస్పిటల్/మీ ట్రీట్మెంట్ పత్రాలు అన్ని తీసుకొని వెళ్ళాలి.
- మెడికల్ సర్టిఫికేట్ కోరే ఉద్యోగి తప్పకుండా వారి సమక్షంలో ఉండాలి.
- మీరు పెట్టుకున్న అర్జి ని బట్టి ఇద్దరు మెంబర్లు, చైర్మన్ మీ పత్రాలను పరీశిలించి మీకు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు.
- జిల్లా మెడికల్ బోర్డు నుండి ఒక ప్రొసీడింగ్స్ తొ పాటు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు.
- మీ యొక్క ఆదార్ కార్డ్, మరియు ఉద్యోగ గుర్తింపు కార్డ్ తప్పనిసరి.
For latest updates join our whatsapp group:- CLICK HERE