MATHS TALENT TEST-2021 FOR 10TH CLASS STUDENTS BY SADISHA FOUNDATION

సదిశా ఫౌండేషన్ వారు 2021 సంవత్సరంనకు గాను గణిత ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నారు.

ELIGIBILITIES-అర్హతలు:-

2020-21 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న ZPHS,MODEL SCHOOLS మరియు KASTURBA SCHOOL విద్యార్థులు అందరూ అర్హులే.

EXAM DATE-పరీక్షా తేదీ:-

22-12-2021 WEDNESDAY. ఉదయం 10:30 AMనకు రిపోర్ట్ చేయాలి.

10:50 AM తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబడదు.

EXAM PATTERN-పరీక్షా విధానం:-

ఓపెన్ బుక్ పరీక్షా విధానం. అనగా విద్యార్థులు వారు తెచ్చుకున్న బుక్స్, నోట్స్ లను వాడుకోవచ్చు.

కానీ మొబైల్ ఫోన్లు, క్యాలిక్లేటర్లు అనుమతించబడవు.

ప్రశ్నా పత్రం కేవలం ENGLISH లో ఉంటుంది.

60 నిమిషాల సమయం పరీక్షకు  కేటాయించబడింది.

ఈ 60 నిమిషాలలో మీకు ఇచ్చిన 10 ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది.

అన్ని సమాధానాలు non-negative integers లుగా ఉంటాయి.

SPECIAL FEATURES-ప్రత్యేక వసతులు:-

ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బస్ ఖర్చులు సదిశా ఫౌండేషన్ వారే ఇస్తారు.

మీ స్కూల్ నుండి పరీక్షా కేంద్రంనకు కిలో మీటర్ కు 5 రూపాయల చొప్పున మొత్తం రవాణా ఖర్చు వారే ఇస్తారు.

అంతేకాకుండా పరీక్ష కు హాజరయ్యే ప్రతీ విద్యార్థికి కూడా ఎక్జాం ప్యాడ్,పెన్ పేపర్లు, మాస్క్ లు, శానిటైజర్ లను అందించడం జరుగుతుంది.

భోజన సదుపాయం కూడా కలదు.

PRIZES-బహుమతులు:-

ఈ పరీక్షలో ఎంపిక కాబడిన 63 మంది విద్యార్థులకు వారి ఇంటర్ చదువు (2 సం.) మరియు హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తారు.

ఈ 63 మంది ఎంపికలో రిజర్వేషన్ కలదు.

21- ఓపెన్ కేటగిరి విద్యార్థులకు

21-ZP స్కూల్ విద్యార్థులకు

21-ZP స్కూల్ బాలికలకు కేటాయించారు.

ప్రైజ్ మనీ, మెమంటో కూడా ఇస్తారు.

టాప్-౩ లో వచ్చిన స్కూల్ పిల్లలకు కింది విధంగా ప్రైజ్ మనీ ఇస్తారు.

ఉదాహరణకు ఒక స్కూల్ నుండి పాల్గొన్న 20 మంది విద్యార్థులు కలిసి 30 సరియైన సమాధానాలు చేస్తే వారికి 30,౦౦౦ రూపాయలు ఇస్తారు.

ప్రైజ్ మనీ 2000 రూపాయలు దాటితే చెక్ రూపంలో ఇస్తారు.

NOTE-గమనిక:-

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ఆధార్ కార్డ్ తప్పకుండా తీసుకొని రావాలి.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో 800 మంది విద్యార్థులు, మిగతా జిల్లా కేంద్రాలలో 300 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం లభిస్తుంది.

మొదటగా  పేరు రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

REGISTRATION LINK-రిజిస్ట్రేషన్ లింక్:-

https://sadisha.org/student-registration

రిజిస్ట్రేషన్ లో ఇబ్బంది ఉంటే 9550895968 ను సంప్రదించవచ్చు.

లేదా [email protected] కి మెయిల్ చేయవచ్చు.

PREVIOUS PARES-గత పరీక్షా పత్రాలు:-

కింది లింక్ ని క్లిక్ చేసి గతంలో జరిగిన పరీక్షా పత్రాలను చూడవచ్చు.ప్రాక్టీసు చేయవచ్చు.

https://sadisha.org/talent-test/previous-papers

ALL THE BEST.

మిగతా సమాచారం ఇదే వెబ్ పేజిలో అందుబాటులో ఉంచుతాము-.THANK YOU

error: Content is protected !!